‘సవ్యసాచి’ తొలి పాట వచ్చేసింది! 

Spread the love

‘సవ్యసాచి’ తొలి పాట వచ్చేసింది! 
హైదరాబాద్‌: నాగచైతన్య కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సవ్యసాచి’. నిధి అగర్వాల్‌ కథానాయిక. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌.వై, మోహన్‌ చెరుకూరి (సీవీఎం) నిర్మాతలు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ చిత్రం నవంబరులో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలోని తొలి లిరికల్‌ పాటను చిత్రబృందం విడుదల చేసింది. ‘వై నాట్‌.. మనకిక్కడ చేదైనా తీపౌతుందోయ్‌..వై నాట్‌.. మన ఇద్దరి బాధైనా హాయ్‌ అవుతుందోయ్‌’ అంటూ సాగుతున్న ఈ పాట ఆకట్టుకుంటోంది. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా బాగుంది.

తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు రాని ఓ సరికొత్త కథాంశంతో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. ఇందులో రెండు చేతులతోనూ సమబలం ప్రదర్శించే యువకుడి పాత్రలో నాగచైతన్య కనిపిస్తారు. మాధవన్‌, భూమిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కి మంచి స్పందన లభించింది. వెన్నెల కిషోర్‌, సత్య, రావు రమేశ్‌‌, తాగుబోతు రమేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎం.ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *