రేవంత్‌.. దమ్ముంటే నాపై గెలువు

Spread the love

రేవంత్‌.. దమ్ముంటే నాపై గెలువు

కొడంగల్‌: మాటలతో మభ్యపెట్టి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఈసారి ప్రజలు తప్పకుండా తిరస్కరిస్తారని కొడంగల్‌ తెరాస అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈటీవీకి ఇచ్చిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. రేవంత్‌ను ఓడించేందుకు రూ.వందకోట్ల ఒప్పందం కుదిరిందంటూ చేస్తున్న ప్రచారం హాస్యాస్పదమని ఆయన అన్నారు.

తెరాస ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను గెలుపు తీరాలకు చేరుస్తాయని నరేందర్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధి పథకాలపై ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తోందని.. అన్ని వర్గాల ప్రజలకు ఏదో ఒక రూపంలో మేలు జరిగిందని ఆయన అన్నారు. ఈ దీపావళి నాటికి మిషన్‌ భగీరథ ఫలాలు అన్ని గ్రామాలకు అందుతాయని.. రాబోయే రెండేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ద్వారా కొడంగల్‌ నియోజకవర్గానికి సాగునీరు అందిస్తామని నరేందర్‌రెడ్డి వివరించారు. కొడంగల్‌లో మిషన్‌ భగీరథ ఆలస్యానికి రేవంత్‌రెడ్డి తీరే కారణమని విమర్శించారు. నియోజకవర్గంలో నాపరాయి పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. దమ్ము, ధైర్యముంటే రేవంత్‌రెడ్డి తనపై గెలవాలని నరేందర్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *