భాజపా అనుమతితోనే ముందస్తు ఎన్నికలు: పొన్నం‌

Spread the love

భాజపా అనుమతితోనే ముందస్తు ఎన్నికలు: పొన్నం‌

హైదరాబాద్‌: తెరాసకు ఓటేస్తే.. భాజపాకు ఓటేసినట్లేనని మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్‌కు ధైర్యం ఉంటే ఇతర పార్టీల నుంచి వచ్చినవారు కాకుండా… తెరాస నేతలకు మాత్రమే 119 నియోజకవర్గాల్లో టిక్కెట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. భాజపా నేతలు కరీంనగర్‌లో సభ పెట్టి ప్రజలకు ఏం చెబుతారని పొన్నం ప్రశ్నించారు. ప్రజలకు నెరవేర్చని హామీల గురించి, తెరాసతో స్నేహం గురించి చెబుతారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు భాజపా ఏం చేసిందని ఆ పార్టీ నేతలు ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. భాజపా సహకారంతోనే కేసీఆర్‌ తొమ్మిది నెలల ముందే ఎన్నికలకు తెరదీశారని పొన్నం ఆరోపించారు. భాజపా ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చలేకపోయిందని పొన్నం ఆరోపించారు. ఈ నాలుగేన్నరేళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనమేంటో కేసీఆర్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కనీసం విభజన హామీలను సైతం నెరవేర్చకుండా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో భాజపా తెలంగాణలో 119 స్థానాల్లో పోటీచేస్తే 100 చోట్ల డిపాజిట్‌ కూడా రాదని పొన్నం ప్రభాకర్‌ సవాల్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *