కరీంనగర్‌ జిల్లాలో పరువు హత్య?

Spread the love

కరీంనగర్‌ జిల్లాలో పరువు హత్య?
కుమార్‌ అనే యువకుడి అనుమానాస్పద మృతి
ప్రియురాలి కుటుంబీకులే హత్య చేశారంటూ బంధువుల ఆందోళన

తాడికల్‌: కరీంనగర్‌ జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. తాడికల్‌కు చెందిన గడ్డి కుమార్‌ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. తాడికల్‌ శివారులోని వంకాయగూడెం గ్రామం వద్ద ఓ పత్తి చేనులో మంగళవారం ఉదయం అతడి మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించారు. కుమార్‌కు అదే గ్రామానికి చెందిన యువతితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. దీంతో ఆ యువతి కుటుంబీకులే తమ కుమారుడిని హత్య చేశారని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కుమార్‌ మృతిచెందిన విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్థులు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. దీనిపై సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న శంకరపట్నం పోలీసులను గ్రామస్థులు అడ్డుకున్నారు. పోలీసు వాహనంపై దాడి చేసి అద్దాలు పగులగొట్టారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ కరీంనగర్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో ఈ మార్గంలో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *