‘18 రోజుల యుద్ధం, లక్షల శవాలు..’

Spread the love

‘18 రోజుల యుద్ధం, లక్షల శవాలు..’
క్రిష్‌ చేతుల మీదుగా ‘రథం’ ట్రైలర్ విడుదల‌‌

హైదరాబాద్‌: ‘18 రోజుల యుద్ధం, లక్షల శవాలు.. కురుక్షేత్ర యుద్ధం కూడా ధర్మం కోసమే..’ అంటూ రూపొందిన ‘రథం’ చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి విడుదల చేశారు. గీత్‌ ఆనంద్, చాందినీ భగ్వానాని జంటగా నటిస్తున్న చిత్రమిది. కె.చంద్రశేఖర్‌ దర్శకుడు. రాజ్‌ గురు ఫిల్మ్స్‌ పతాకంపై రాజా దారపునేని నిర్మిస్తున్నారు. సుకుమార్‌ పమ్మి సంగీతం అందిస్తున్నారు.

ఇటీవల ఈ సినిమాలోని పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి విడుదల చేశారు. తాజాగా చిత్ర ట్రైలర్‌ను క్రిష్‌ ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. ‘యుగాల నాటి కురుక్షేత్ర యుద్ధం కూడా ధర్మం కోసమే.. ప్రామిసింగ్‌గా ఉన్న ‘రథం’ సినిమా ట్రైలర్‌ ఇదిగో. మొత్తం యూనిట్‌ సభ్యులకు ఆల్‌ ది బెస్ట్‌’ అని ఆయన‌ ట్వీట్‌ చేశారు.

‘పెద్దంతరం.. చిన్నంతరం లేకుండా పెంచిందా బాబూ మీ అమ్మ. గుమ్మం ముందుకు వచ్చి రొమ్ము విసురుతున్నావేంటి..’, ‘మంచోడు పక్కింట్లో ఉంటే మనోడు అంటాం.. అదే వాడు మన ఇంట్లో ఉంటే ఇవన్నీ మనకు ఎందుకు రా అంటాం..’, ‘18 రోజుల యుద్ధం, లక్షల శవాలు.. కురుక్షేత్ర యుద్ధం కూడా ధర్మం కోసమే..’ అనే ఆసక్తికర డైలాగ్స్‌తో రూపొందిన ఈ ట్రైలర్‌ అలరిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *