రామ్ కు మంచి ఛాన్స్!

Spread the love

రామ్ కు మంచి ఛాన్స్!

హీరో రామ్ పోతినేని కెరీర్ లో ఉన్నన్ని అప్ అండ్ డౌన్స్ బహుశా ఎవరికి లేవేమో అనిపిస్తుంది. ఒక పెద్ద హిట్ వస్తే చాలు ఆ వెంటనే పరాజయాలు క్యూ కడుతున్నాయి. మళ్ళి ఇంకో సక్సెస్ రావడం ఆలస్యం చైన్ కంటిన్యూ అవుతోంది. అందుకే గ్యాప్ తీసుకుని మరీ చేస్తున్న హలో గురు ప్రేమ కోసమే మీద అంచనాలు భారీగా పెట్టుకున్నాడు ఎనర్జిటిక్ స్టార్. గత ఏడాది చేసిన ఉన్నది ఒకటే జిందగీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. హిట్ కాంబో అవుతుంది కదాని నేను శైలజ దర్శకుడు తిరుమల కిషోర్ తో చేసిన ప్రయోగం వర్క్ అవుట్ కాలేదు.

అందుకే ఈసారి ఊపుమీదున్న త్రినాథ రావుతో జట్టు కట్టాడు. సినిమా చూపిస్తా మావా-నేను లోకల్ వరుస హిట్లతో హ్యాట్రిక్ మీద కన్నేసిన ఈ దర్శకుడు మొదటిసారి రామ్ తో జత కలిసాడు. నేను లోకల్ టైంలోనే ఇచ్చిన మాటతో దిల్ రాజుకే ఇది కూడా కమిట్ అయ్యాడు. టీజర్ తో పాటు రెండు ఆడియో సింగల్స్ ఇప్పటి దాకా విడుదల అయ్యాయి. ఇంకో రెండు వారాలు మాత్రమే టైం ఉండటంతో ప్రమోషన్ వేగం పెంచే పనిలో ఉంది దిల్ రాజు టీమ్. ఇంకా ఇప్పటిదాకా అధికారికంగా అక్టోబర్ 18 అని ప్రకటించలేదు కానీ దాదాపు ఖరారైనట్టే. అది మిస్ చేసుకుంటే పండగ సీజన్ తో పాటు మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నట్టే.

అరవింద సమేత వీర రాఘవ అప్పటికే వచ్చి వారం రోజులు దాటి ఉంటుంది కాబట్టి సమస్య ఉండదు. విశాల్ పందెం కోడి 2 బరిలో డబ్బింగ్ సినిమా కాబట్టి కొన్ని పరిమితులు ఉంటాయి. వీటిని అనుకూలంగా మార్చుకుని కంటెంట్ తో మెప్పిస్తే హలో గురు ప్రేమ కోసమే పాసైపోతుంది. కానీ బాగుంది అనే టాక్ వచ్చే కండిషన్ మీదే సుమా. అనుపమ బ్యాక్ డోర్ నడుమందాలు టీజర్ లో ఇప్పటికే యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *