భారీవర్షాల ముప్పు.. అప్రమత్తంగా వాయుసేన

Spread the love

భారీవర్షాల ముప్పు.. అప్రమత్తంగా వాయుసేన


చెన్నై, తిరువనంతపురం: అరేబియా సముద్రంలో అల్పపీడనం కారణంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో రానున్న 4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించడంతో సహాయక చర్యలకు భారత వాయు సేన సిద్ధమవుతోంది. ఏ క్షణంలోనైనా సహాయం అందించాల్సి రావొచ్చని అప్రమత్తంగా ఉంది. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు కేరళకు చేరుకున్నాయి. వాయనాద్‌, పాలక్కాడ్‌, ఇడుక్కి, పథనంతిట్ట, కోజికోడ్‌లలో ఈ బృందాలు మోహరించాయి. తమిళనాడు, పుదుచ్చేరిలలో ఇప్పటికే వర్షాలు కురుస్తుండడంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని జిల్లా యంత్రాగాలకు మార్గదర్శకాలు జారీ చేశాయి.

కేరళలో రేపు ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇడుక్కిలో 7వ తేదీన రెడ్‌ అలర్ట్‌, 6,8 తేదీల్లో ఆరెంజ్ అలర్ట్‌ ప్రకటించింది. మలప్పురం, పాలక్కాడ్‌, వాయనాద్‌, పథనంతిట్ట జిల్లాలో 6,7,8 తేదీల్లో కుంభ వృష్టి కురిసే అవకాశం ఉంది. కేరళలో మున్నార్‌ సహా ఎత్తైన పర్యాటక ప్రాంతాలకు వెళ్లొద్దని ప్రభుత్వం హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరిలలో భారీ వర్షాలు, కర్ణాటకలో స్వల్ప వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *