ఆన్‌లైన్‌ షాపింగ్‌ సందడి షురూ!

Spread the love
ఆన్‌లైన్‌ షాపింగ్‌ సందడి షురూ!

ఇంటర్నెట్‌డెస్క్‌: మరికొద్ది రోజుల్లో ఆన్‌లైన్‌ అంగళ్లలో కొనుగోళ్ల సందడి మొదలు కాబోతోంది. ప్రధాన పోటీదారులైన ఈ-కామర్స్‌ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లు బిగ్‌ బిలియన్‌ డేస్‌, ద గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ పేర్లతో వినియోగదార్లను ఆఫర్ల జడి వానలో ముంచెత్తనున్నాయి. ఈ నెల 10 నుంచి 14 వరకూ ఒకే సమయంలో రెండు కంపెనీలు పోటాపోటీగా ఈ ఆఫర్లను అందిస్తున్నాయి. ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఫ్యాషన్‌ సహా విస్తృత స్థాయి ఉత్పత్తులపై రాయితీ పొందవచ్చు. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్ల అమ్మకాలు లక్ష్యంగా రెండు సంస్థలు ఆఫర్లను ప్రకటించాయి.

బిగ్‌ బిలియన్‌ డేస్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్‌లను ప్రకటించింది. రూ.13,999గా ఉన్న హానర్‌ 9ఎన్‌ (3జీబీ ర్యామ్‌, 32 జీబీ అంతర్గత మెమొరీ) ఫోన్‌ను కేవలం రూ.9,999కే అందించనుంది. అలాగే 4జీబీ, 64 జీబీ వేరియంట్‌ అసలు ధర రూ.16,999 ఉండగా.. రూ.11,999 కే లభించనుంది. హానర్‌ 10 ఫోన్‌పై రూ.8 వేలు రాయితీతో పాటు అదనంగా 50 శాతం బై బ్యాక్‌ ఆఫర్‌ను ప్రకటించింది. దీని అసలు ధర రూ.32,999. ఇదే తరహాలో హానర్‌ 7ఏ, 7ఎస్‌, 9 లైట్‌ ఫోన్లపైనా ఆఫర్లు అందిస్తోంది. ఇవేకాకుండా మోటో జెడ్‌2 ఫోర్స్‌, జెడ్‌2 ప్లే, ఎక్స్‌4, లెనోవో కే8ప్లస్‌, ఒప్పో ఏ71లపైనా బిగ్‌ బిలియన్‌ డేస్‌ ఆఫర్‌లో భాగంగా భారీ రాయితీలను ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది.

గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో భాగంగా అమెజాన్‌ సంస్థ వన్‌ ప్లస్‌ 6 (6జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ) ఫోన్‌ను రూ.5 వేలు డిస్కౌంట్‌తో రూ.29,999కే అందిస్తోంది. ఇక అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యుల కోసం ముందుగా వివో వీ9 ప్రో ఫోన్‌ను అందుబాటులో ఉంచనుంది. రెడ్‌మీ వై2, హానర్‌ 7సి, హువాయ్‌ నోవా 3ఐ, హానర్‌ ప్లే, రియల్‌ మీ 1, వివో వై83 ఫోన్లపైనా అమెజాన్‌ రాయితీలు ఇస్తున్నట్లు ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *