బారెడు చాకిరీకి బెత్తెడు జీతమా…

Spread the love

కార్మికుడి నుండి కార్పొరేట్ దిగ్గజం వరకు
సామాన్యుడి నుండి షేర్ మార్కెట్ వరకు
ఆర్ధిక లావాదేవీలకు అవసరం బ్యాంకు !
ఆర్దిక మనుగడకు మూలం బ్యాంకు !!

జనహితం కోరే బ్యాంకు ఉద్యోగి కి
స్వహితం మాత్రం దూరమా !!
బారెడు చాకిరీకి బెత్తెడు జీతమా?

నగదు మార్పిడి కి బ్యాంకు
సిలిండర్ సబ్సిడీ కి బ్యాంకు
స్టూడెంట్ స్కాలర్షిప్ కి బ్యాంకు
ఆధార్ ఆప్డేషన్ కి బ్యాంకు
డ్వాక్రా మహిళల చేయూత కి బ్యాంకు

కాని
బ్యాంకు ఉద్యోగి
బారెడు చాకిరీకి 2 శాతమా? అదీ జీతమా?

మారాలి మారాలి చాలి చాలని జీతాలు మారాలి
కావాలి కావాలి మా కష్టానికి ప్రతిఫలం కావాలి

గవర్నమెంట్ బళ్ళో పంతులు గారి భత్యమ్ కి
పిల్లల రుసుముకి సంభందం లేదు !!
గవర్నమెంట్ డాక్టర్ జీతానికి
వచ్చే పేషెంట్ రోగానికి పొంతన లేదు !!
రైలు కూత తో రైలు ఉద్యోగి జీతానికి,
బస్సు పరుగు తో బస్సు ఉద్యోగి జీతానికి
సంబంధం లేదు….

కానీ
బ్యాంకు ఉద్యోగి జీతం మాత్రం
బ్యాంకు లాభం తో ముడి పడిందా ?

అప్పు ఏగ్గోట్టిన వాడికి వేస్తారు మీరు ఎర్ర తివాచీ
బ్యాంకు శ్రేయస్సుకు శ్రమించే మాతో నా మీకు పేచి
మొండి బకాయిల వసూళ్ల పై మీకున్న శ్రద్ధ కన్నా
మా జేబులకు మీరు పెట్టె చిల్లులే ఎక్కువన్నా

బారెడు చాకిరీకి బెత్తెడు జీతమా?

మారాలి మారాలి చాలి చాలని జీతాలు మారాలి.
కావాలి కావాలి మా కష్టానికి ప్రతిఫలం కావాలి…


ఇది ఓ సామాన్య బ్యాంకు ఉద్యోగి మనోవేదన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *