RBI INVESTIGATION IN AP FOR MISSING CURRENCY NOTES

Spread the love

ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే డబ్బులు కొరత పై దర్యాప్తు చేయనున్నా ఆర్బీఐ

నోట్ల రద్దు అనంతరం డబ్బు పంపడం ప్రారంభించిన నాటి నుంచి..ఎపిలో అదృశ్యమైన ఆ 38 వేల కోట్ల నగదు ఆచూకి కోసం… రంగంలోకి ఆర్బీఐ

* కేంద్ర ఆర్థిక శాఖ కూడా ఈ విషయంపై క్షేత్ర స్ధాయి వరకూ వెళ్లి ఏం జరుగుతుందో క్షణ్ణంగా దర్యాప్తు చేయాలంటూ ఆర్బీఐ కి ఆదేశం
********************************************
నోట్ల రద్దు అనంతరం డబ్బు పంపడం ప్రారంభించిన నాటి నుంచి గత నెల మార్చి వరకు ఎపికి 40 వేల కోట్ల రూపాయల నగదు పంపించామని, ఎపి బ్యాంకులు చెబుతున్న ప్రకారం 2300 కోట్ల నగదే ఉంటే మరి మిగతా 37,700 కోట్ల నగదు ఏమైంది?

ఆంధ్రప్రదేశ్ లో ఎటిఎంలో డబ్బు రాక ప్రజలు నానా ఇక్కట్లు పడుతూ దీంతో ఈ విషయం తెలిసిన ఆర్బీఐ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఎపికే డబ్బును పంపామని, అయినా అక్కడే నగదు కొరత రావడం ఏమిటంటూ ఆశ్చర్యపోయారట. అందుకే అసలేం జరిగిందో తెలుసుకునేందుకు విచారణ కోసం ఎపికి రానున్నారట.

ఎపిలో ఇలా డబ్బుల లెక్కలు తేడా వచ్చాయనేసరికి కేంద్ర ఆర్థిక శాఖ కూడా ఈ ఈ విషయంపై క్షేత్ర స్ధాయి వరకూ వెళ్లి ఏం జరుగుతుందో క్షణ్ణంగా దర్యాప్తు చేయాలంటూ ఆర్బిఐని ఆదేశించిందట. దీంతో అతి త్వరలో ఆర్బిఐ అధికారులు రాష్ట్రానికి వచ్చి దర్యాప్తు మొదలుపెట్టనున్నట్లు ఢిల్లీ స్థాయిలో వార్తలు వినిపిస్తున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *